ప్రేమ యేసయ్య ప్రేమా

Telugu Christian Song

ప్రేమ యేసయ్య ప్రేమా (4) మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది (2) ||ప్రేమ|| తల్లి మరచిన గాని నను మరువనన్న ప్రేమ తండ్రి విడిచిన గాని నను విడువనన్న ప్రేమ (2) నే ఏడుస్తుంటే – ఎత్తుకున్న ప్రేమా తన కౌగిట్లో నను హత్తుకున్న ప్రేమా (2) ||ప్రేమ|| నేను మరచిన గాని నను మరువునన్న ప్రేమ నేను విడచిన గాని నను విడువనన్న ప్రేమ (2) నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమా తన కృపలో నన్ను దాచుకొన్న ప్రేమా (2) ||ప్రేమ|| నేను పుట్టకముందే నను ఎన్నుకున్న ప్రేమ నేను ఎరుగకముందే ఏర్పరుచుకున్న ప్రేమ (2) తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమా ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమా (2) ||ప్రేమ|| --Prema yesayya prema--
Telugu