ప్రేమ యేసుని ప్రేమ - అది

Telugu Christian Song

ప్రేమ యేసుని ప్రేమ - అది ఎవ్వరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము - ఇది భువి యందించలేనిది ఎన్నడెన్నడు మారనిది - నా యేసుని దివ్య ప్రేమ ఎన్నడెన్నడు వీడనిది - నా యేసుని నిత్య ప్రేమ 1. తల్లీతండ్రుల ప్రేమ - నీడవలె గతియించును కన్నబిడ్డల ప్రేమ - కలలా కరిగిపోవును ...ఎన్నడెన్నడు... 2. భార్యాభర్తల మధ్య - వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయిరాలును త్వరలో - మోడులా మిగిలి పోవును ...ఎన్నడెన్నడు... 3. బంధూమిత్రుల యందు - వెలుగుచున్న ప్రేమ దీపమూ నూనె ఉన్నంత కాలము - వెలుగు నిచ్చి ఆరిపోవును ...ఎన్నడెన్నడు... 4. ధరలోని ప్రేమలన్నియూ - స్థిరముకాదు తరిగి పోవును క్రీస్తు యేసు కల్వరి ప్రేమా - కడవరకు ఆదరించును ...ఎన్నడెన
Telugu