రాజాధి రాజ రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక
విడువని కృప నాలో స్థాపించెనే సీయోనులో నున్న స్తుతుల సింహసనమునే
వర్ణనకందని పరిపూర్ణమైన నీ
మహిమ స్వరూపమును నా కొరకే త్యాగము చేసి
కృపా సత్యములతో కాపాడుచున్నావు
దినమెల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించెద
ఊహల కందని ఉన్నతమైన నీ
ఉద్దేషములను నా యెడల సఫలపరచి
ఊరేగించుచున్నావు విజయోత్సవముతో
యేసయ్య నీకన్న తోడెవ్వరులేరు ఈ ధరణిలో
మకుటము ధరించిన మహారాజువై నీ
సౌబాగ్యమును నా కొరకే సిద్దపరచితివి
నీ పరిశుద్దమైన మార్గములో నడిచి
నీ సాక్షినై కాంక్షతో పాడెద స్తోత్ర సంకీర్తనలే
--Raajadhi raaja ravi koti theja--