రాకడ ప్రభుని రాకడ

Telugu Christian Song

రాకడ ప్రభుని రాకడ రాకడ రెండవ రాకడ ఏ దినమో ఏ ఘడియో (2) ఎవ్వరు ఎరుగనిది రెప్పపాటున కాలమున తప్పక వచ్చునది ||రాకడ|| నోవాహు దినములలో జరిగినట్లుగా లోతు కాలమున సాగినట్లుగా (2) పాపమందు ప్రజలంతా మునిగి తేలగా లోకమంతా దేవుని మరచియుండగా (2) మధ్యాకాశమునకు ప్రభువు వచ్చుగా మహిమతో తన ప్రజల చేర పిలుచుగా (2) ||రాకడ|| దేవుని మరచిన ప్రజలందరిని సువార్తకు లోబడని జనులందరిని (2) శ్రమల పాలు చేయను ప్రభువు వచ్చును అగ్ని జ్వాలలతో అవని కాల్చును (2) వేదనతో భూమినంత బాధపరచును తన మహిమను ప్రజలకు తెలియపరచును (2) ||రాకడ|| --Raakada prabhuni raakada--
Telugu