రావయ్యా వరుడా (రావమ్మా వదువా)

Telugu Christian Song

వచ్చింది వచ్చింది మధురమైన సమయం తెచ్చింది నూతన కాంతుల ఉదయం రావయ్యా వరుడా (రావమ్మా వదువా) సుస్వాగతం నీకోసమే ఈ స్వాగత గీతం 1.మల్లెలు పరిమళం చల్లినవేళ అల్లరి తెమ్మెర తాకినవేళ /2/ వెల్లువై ఆనందం పొంగిన వేళ మెల్లగ నీ పాటి దరిచేరగా /2/రా/ 2.కోయిల గానాలు వినిపించువేళ కోరిన ఘడియలు ఎదురైనవేళ /2/ చామంతులే పలకరించినవేళ చేయందుకొని సతిని స్వీకరించగా /2/రా/ 3.పరలోక వాకిళ్లు తెరచుకొన్నవేళ పరమాశీర్వాదాలే కురియుచున్నవేళ /2/ మనసైన నీ వరుడు ఎదురు చూచువేళ వినయముగా నీ ప్రియుని సంధించగా /2/రా/ --Raavayya varuda--
Telugu