రక్షకుండుదయించ్నాఁడఁట మనకొరకుఁబరమ రక్షకుం డుదయించి
నాఁడఁట రక్షకుం డుదయించినాఁడు రారె గొల్లబోయలార తక్షణమునఁ
బోయి మన ని రీక్షణ ఫల మొందుదము |రక్షకుండు|
1. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాఁడు దేవుఁడగు యెహోవా
మన దిక్కుఁ దేరి చూచినాఁడు |రక్షకుండు|
2. గగనమునుండి డిగ్గి ఘనుఁడు గబ్రియేలు దూత తగినట్టు చెప్పె వారికి
మిగుల సంతోషవార్త |రక్షకుండు|
3. వర్తమానము జెప్పి దూత వైభవమున పోవుచున్నాఁడు కర్తను జూచిన
వెనుక కాంతుము విశ్రమం బప్పుడు |రక్షకుండు|
4. పశువుల తొట్టిలోన భాసిల్లు వస్త్రములజుట్టి శిశువును గనుగొందురని
శీఘ్రముగను దూత తెల్పె |రక్షకుండు|
5. అనుచు గొల్ల లొకరి కొక రానవాలు జెప్పుకొనుచు అనుమతించి
క