రక్షకుని జన్మస్థలమా యూదయ బెత్లహేమా _(2)
ఆరాధనకు ఆరంభమా హృదయర్పణలకు నివాసమా _(2)
ఎందుకో ఇంత భాగ్యము దాచి ఉంచే ప్రభు నీకోసము _(2)
స్తుతియు మహిమ ప్రభావము
ఎల్లవేళలా ప్రభుకే చెందును _(2)
(రక్షకుని జన్మస్థలమా)
1.ప్రవచించే నాడు ప్రవక్తలు
క్రీస్తు జన్మ శుభవార్తను ఆశించే నాడు కన్యలు
ప్రభువుకు జన్మ నివ్వాలని_(2)
తండ్రి చిత్తమే నెరవేరగా
కన్య మరియకే ప్రాప్తించగా
జన్మించే యేసు మహారాజుగా కాలము విడిపోయే రెండుగా_(2)
(స్తుతియు మహిమ ప్రభావము)
2. నోటి మాటతో సృష్టిని తన చేతులతో ఈ మనిషిని
చేసిన దేవుడు దీనుడై పవళించెను పశువుల పాకలో (2)
నీ చరిత్రనుమార్చు దేవుడు
తన మహిమనే నీకిచ్చెను
యూదా ప్రధానులందరిలో నీ