రక్షణ పొందితివా నిరీక్షణ నొందితివా

Telugu Christian Song

రక్షణ పొందితివా నిరీక్షణ నొందితివా బ్రతుకిల మారినదా-నీ భారం తీరినదా 1.ఎన్నాళ్లు పాపపు-బ్రతుకు ఎందాక ఈ శాపపు పరుగు అంతయు మరణమేగా నీ అంతము నరకమేగా ||రక్షణ|| 2.ఆగదు సమయం నీ రక్షణకై ఆగదు మరణం నీ కోరికపై అనువగు సమయమిదే నీ రక్షణ సుదినమిదే ||రక్షణ|| 3.ఎన్నాళ్లుగ ప్రభు నెదిరించితివో ఎందాక ప్రభుని విసికించితివో కొంచెము యోచించు నీ వించుక గమనించు ||రక్షణ|| 4.పాపము నుండి తిరుగుము నేడే పాపిని ప్రభువా మన్నించు మని పరితాపము పొంది ప్రార్ధించుము ఈ దినమే ||రక్షణ|| 5.ప్రేమమయుడు ప్రభువగు క్రీస్తు ప్రాణము పెట్టెను సిలువలో నీకై పాపము తొలగించున్ నీ శాపము పరిమార్చున్ ||రక్షణ|| --Rakshana pondithivaa nireeksha
Telugu
1 views