రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు

Telugu Christian Song

రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు ||2|| ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని ||2|| గ్రహించి నీవు యేసుని చూచిన హద్దు లేని ఇంపు పొందెదవు ||2|| ||రమ్మను|| కన్నీరంతా తుడుచును కనుపాపవలె కాపాడున్ ||2|| కారు మేఘమువలె కష్టములు వచ్చిననూ కనికరించి నిన్ను కాపాడును ||2|| ||రమ్మను|| సోమ్మసిల్లు వేళలో బలమును నీకిచ్చును ||2|| ఆయన నీ వెలుగు రక్షణనై యుండును ఆలసింపక త్వరపడి రమ్ము ||2|| ||రమ్మను|| సకల వ్యాధులను స్వస్థత పరచుటకు ||2|| శక్తిమంతుడగు ప్రభు యేసు ప్రేమతో అందరికి తన కృపలనిచ్చున్ ||2|| ||రమ్మను|| --Rammanuchunnadu ninnu prabhu yesu--
Telugu