రమ్ము! నీ తరుణమిదే

Telugu Christian Song

రమ్ము! నీ తరుణమిదే పిలచుచున్నాడు నీ ప్రభువైన యేసు నొద్దకు 1. జీవితమంతయు వ్యర్థముగను దుఃఖముతోను గడుపుటయేల వచ్చి ఆయన శరణు జొచ్చినచో వాంఛతో నిన్ను స్వీకరించున్ ||రమ్ము|| 2. కట్టిన యిల్లు ధనధాన్యములు కనబడు బంధుమిత్రులును గూడు విడిచి నీవు పోయినచో వెంటనీతో రారెవరు ||రమ్ము|| 3. అందము మాయ అస్థిరమే దాని నమ్మకుము మోసగించును మరణము ఒకనాడు వచ్చును మరువకు నీ ప్రభువును ||రమ్ము|| 4. మిన్ను క్రిందన్ భూమి మీదన్ మిత్రుడేసు నామముగాక రక్షణ పొందు దారిలేదు రక్షకుడేసే మార్గము ||రమ్ము|| 5. తీరని పాపవ్యాధులను మారని నీదు బలహీనతల్ ఘోర సిలువలో మోసితీర్చెన్ గాయములచే బాగుపడన్ ||రమ్ము|| 6. సత్యవాక్కును నమ్మి రమ్ము నిత్
Telugu