రండహో వినరండహో

Telugu Christian Song

రండహో వినరండహో శుభవార్త ఒకటి వినిపించెదం సంతోషముతో దరి చేరండి సంభ్రాలతో యిక స్తుతి కలపండి (2X) |రండహో.. 1. అలనాడు బెత్లేహేము పశుల పాకలో కన్నియ మరియకు శిశువు పుట్టెను (2X) గొల్లలు జ్ఞానులు కానుకలతో స్తుతులర్పించిరి (2X) |రండహో.. 2. ప్రవచనమునుబట్టి అభిషక్తుడవతరించె భూరాజులకదిఎంతో భీతి కలిగించెన్ (2X) అంతము చేయ దలచినంత దూత గణం రక్షించెన్ (2X) సంభ్రాలతో యిక శృతి కలపండి |రండహో.. 3. నాటి నుండి నేటి వరకు కృపతో తోడుండి పరమందు తండ్రి కుడి ప్రక్కన కూర్చున్నా (2X) యేసుని జన్మ శుభాశిస్సులందు కొనరండి (2X) సంభ్రాలతో యిక శృతికలపండి |రండహో.. --Randahoo vinarandahoo--
Telugu