రండి సువార్త సునాదముతో రంజిలు సిలువ నినాదముతో
తంబుర సితార నాదముతో ప్రభుయేసు దయానిధి సన్నిధికి
1. యేసే మానవ జాతి వికాసం యేసే మానవ నీతి విలాసం
యేసే పతిత పావన నామం భాసుర క్రైస్తవ శుభనామం
2. యేసే దేవుని ప్రేమస్వరూపి యేసే సర్వేశ్వర ప్రతిరూపం
యేసే ప్రజాపతి పరమేశం ఆశ్రిత జనముల సుఖవాసం
౩. యేసే సిలువను మోసినదైవం యేసే ఆత్మల శాశ్వత జీవం
యేసే క్షమాపణ అధికారం దాసుల ప్రార్థన సహకారం
4. యేసే సంఘములో మనకాంతి యేసే హృదయములో ఘనశాంతి
యేసే కుటుంబ జీవనజ్యోతి పసిపాపల దీవెన మూర్తి
5. యేసే జీవన ముక్తికి మార్గం యేసే భక్తుల భూతల స్వర్గం
యేసే ప్రపంచ శాంతికిసూత్రం వాసిగనమ్మిన జనస్తోత్రం
--Randi suvaartha sunaadamu