రండి ఉత్సాహించి పాడుదము

Telugu Christian Song

రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే (2) 1.రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికేగుదము (2) సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోష గానము చేయుదము ||రండి|| 2.మన ప్రభువే మహా దేవుండు ఘన మహాత్యము గల రాజు (2) భూమ్యాగాధపు లోయలును భూధర శిఖరములాయనవే ||రండి|| 3.సముద్రము సృష్టించెనాయనదే సత్యుని హస్తమే భువిజేసెన్ (2) ఆయన దైవము పాలితుల ఆయన మేపెడి గొర్రెలము ||రండి|| 4.ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రొక్కుదము (2) ఆయన మాటలు గైకొనిన అయ్యవి మనకెంతో మేలగును ||రండి|| 5.తండ్రి కుమార శుద్దాత్మకును తగు స్తుతి మహిమలు కల్గు గాక (2) ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడూ అయినట్లు యుగములనౌను ఆమెన్ ||రండి|| --Randi
Telugu