రుచి చూచి

Telugu Christian Song

రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రక్షకు నాశ్రయించి నే ధన్యుడనైతిని |రుచి చూచి.. 1. గొప్ప దేవుడవు నీవే స్తుతులకు పాత్రుడ నీవే తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే |రుచి చూచి.. 2. మహోన్నతుడవగు దేవా ప్రభావము గలవాడా మనసారా పొగడదను నీ ఆశ్చర్యకార్యములన్ |రుచి చూచి.. 3. మంచి తనము గల దేవా అతి శ్రేష్టుడవు అందరిలో ముద మార పాడెద నిన్నుఅతి సుందరడవనియు |రుచి చూచి.. 4. ప్రార్దింతును ఎడతెగక ప్రభు సన్నిధిలో చేరి సంపూర్ణముగా పొం దెదను అడుగువాటన్నిటికి |రుచి చూచి.. --Ruchi choochi yerigithini--
Telugu