స్నేహమై, ప్రాణమై వరించే

Telugu Christian Song

స్నేహమై, ప్రాణమై వరించే దైవమై ఇదే జీవితం, నీకే అంకితం ఇదే నా వరం, నీవే అమృతం నిరంతరం సేవించనీ జగతిన వెలసి, మనసున నిలచి కోరె నన్ను దైవము లోకమందు జీవమాయె – చీకటందు దీపమాయె పలకరించే నేస్తమాయె – కనికరించే బంధమాయె ఎంత ప్రేమ యేసయా – నన్ను నీలో జీవించనీ తలపున కొలువై – మనవుల బదులై చేరె నన్ను నిరతము కలతలన్నీ కరిగిపోయే – భారమంతా తొలగిపోయే ఆపదందు క్షేమమాయె – తరిగిపోని భాగ్యమాయే ఎంత ప్రేమ యేసయా – నన్ను నీలో తరియించనీ స్నేహమై, ప్రాణమై వరించే దైవమై ఇదే జీవితం, నీకే అంకితం ఇదే నా వరం, నీవే అమృతం నిరంతరం సేవించనీ --Snehamai praanamai varinche daivamai--
Telugu
1 views