స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయ
స్తుతి - చెల్లించి యుల్లసింతము హల్లెలూయ
అను పల్లవి: గడచిన కాలమెల్ల - కంటిపాపవలె
కాచెను ప్రభువు మమ్ము హల్లెలూయ - ప్రభున్
1. పాపమును బాపినాడు హల్లెలూయ - మన
శాపమును మాపినాడు హల్లెలూయ
కన్నతల్లివలెనె - కనికరించెను మమ్ము
యెన్నతరమా ప్రేమ హల్లెలూయ - ప్రభున్
2. తల్లియైన మరచినను హల్లెలూయ - తాను
ఎన్నడైన మరచిపోడు హల్లెలూయ
ఎల్ల యీవుల నిచ్చి యులాస మొసగును
కొల్లగ మనల కోరి హల్లెలూయ - ప్రభున్
3. శోధన కాలములందు హల్లెలూయ - మన
మేధన కాలములందు హల్లెలూయ
నాథుడు యేసు మన చెంతనుండ నిల
చింత లేమియు రావు హల్లెలూయ - ప్రభున్
4. ఘోర తుఫాను లెన్నెన్నో హల్లెలూయ - బహు
ఘోరముగ లేచినను హల్లెలూ