స్తోత్రం స్తుతి స్తోత్రం మహిమ

Telugu Christian Song

స్తోత్రం స్తుతి స్తోత్రం మహిమ ఘనత నీకే అర్పింతును యేసయ్య నా కోసం మరణించి తిరిగి లేచిన నీకే నా స్తుతి స్తోత్రము భాద కలుగు సమయములో నాకు తోడై నిలచి కష్ట నష్టాలలో నాకు నీడై నిలచి నను దైర్యపరచితివి నా వెంట నిలచితివి నా కోసం మరణించి తిరిగి లేచిన నీకే నా స్తుతి స్తోత్రము నే చేసిన పాపముకై శిక్ష నీవు పొందితివి నే చేసిన దోషముకై సిలువలో మరణించితివి మృత్యుంజయుడై నిలచి మరణాన్నే గెలచితివి నా కోసం మరణించి తిరిగి లేచిన నీకే నా స్తుతి స్తోత్రము --Sthothram sthuthi sthothram mahima ghanatha neeke--
Telugu