స్వఛ్చంద సీయోను వాసి

Telugu Christian Song

స్వఛ్చంద సీయోను వాసి సర్వాధికారి – కస్తూరి పూరాసి (2) వర్తమాన భూత భవి-ష్యత్కాల వాసి (2) అల్ఫా ఒమేగ తానే (2) ఆద్యంతము మన యేసే (2) ||స్వఛ్చంద|| ఇదిగో నేనొక నిబంధనను అద్భుతములు జేతున్ – నీ ప్రజలందరి యెదుట (2) పరిశోధింపజాలని మహా – పనులెల్ల ప్రభువే (2) లెక్క లేని యద్భుతముల్ (2) మక్కువతో చేయువాడు (2) ||స్వఛ్చంద|| సంగీతం నాదముల తోడ సీయోను పురము – సొంపుగను చేరితిమి (2) శాశ్వత సంతోషము మా – శిరములపై వెలసెన్ (2) దుఃఖము నిట్టూర్పును పోయెన్ (2) మిక్కిలి ఆనందము కల్గెన్ (2) ||స్వఛ్చంద|| నీలముల పునాదులు వేసి నీలాంజనములతో – మాణిక్య మణులతో (2) సువర్ణ శునీయముల – సూర్య కాంతముతో (2) ప్రశస్త రత్నములతో (2) ప్రవిమ
Telugu