స్వర్గమున ఆనందము పాపి మారినందుకు

Telugu Christian Song

స్వర్గమున ఆనందము పాపి మారినందుకు దూతలు సంతోషించుచున్నారు ఒకడు రక్షింపబడినందుకు (2) తప్పిపోయిన గొఱ్ఱెను దొరికెను చావబోయినవాడు బ్రతికెను (2) హల్లెలూయా హల్లెలూయా స్వర్గము ఆనందించుచున్నది హల్లెలూయా హల్లెలూయా దూతలు కేరింతలు వేయుచున్నారు (2) ||స్వర్గమున|| తొంభైతొమ్మిది మంది నీతిమంతులకు మార్పు అవసరము లేదు (2) కాని మారుమనసు పొందిన ఒక పాపికొరకు ఆనందము (2) ||స్వర్గమున|| కోల్పోయిన నాణెము దొరికెను ఆ స్త్రీ సంతోషించెను (2) తన స్నేహితురాలును పొరుగువారిని పిలిచి నాతో సంతోషించుడని చెప్పెను (2) ||స్వర్గమున|| --swargamuna aanandamu paapi maarinanduku--
Traditional
Telugu
15 views