సాగేటి ఈ జీవ యాత్రలోరేగేటి

Telugu Christian Song

సాగేటి ఈ జీవ యాత్రలోరేగేటి పెను తుఫానులెన్నో ఆదరించవా నీ జీవ వాక్కుతో సేద దీర్చవా నీ చేతి స్పర్శతో 1. సుడిగుండాలెన్నో లోకసాగరానా వడిగా నను లాగి పడద్రోసే సమయాన నడిపించగలిగిన నా చుక్కాని నీవే విడిపించగలిగిన నాకున్న దిక్కు నీవే యేసయ్యా ఓ మెస్సయ్యా హలెలూయా నీకే స్తోత్రమయా 2. వడగాల్పులెన్నో నా పయనం లోన నడవనీక సొమ్మసిల్ల జేసే సమయాన తడబాటును సరిచేసే ప్రేమ మూర్తి నీవే కడవరకు నడిపే ఇమ్మానుయేలు నీవే యేసయ్యా ఓ మెస్సయ్యా హలెలూయా నీకే స్తోత్రమయా --Saageti ee jeeva yaatralo regeti penu thuphanulenno--
Telugu