సౌందర్యపూర్ణుడా సర్వలోకానాథుడా
రమ్యమైన పాలకా గొప్ప రక్షణా కారకా |2|
యేసయ్యా నా ప్రాణస్నేహిత
మనస్సంతా నిండిన మధురాను బంధమా
అతిప్రియుడా నా ప్రాణేశ్వరా
అపురూపమే నీ ముఖదర్శనం
మనసారా నిన్నే చేరి
ప్రియమారా నిన్నే కొలిచి
ప్రణుతింతును ఆశతీరా అతికాంక్షణీయుడా |2|
1. సద్భక్తితో బ్రతుక ఆశించగా
వాగ్ధాన ధ్వనులే బలపరచెను |2|
విశ్వాసయాత్ర కడగండ్ల పాలైననూ
కన్నీటి కడలి చెలరేగి పొంగిననూ
నీవే నిమ్మళపరచినావు ||మనసారా నిన్నే చేరి||
2. మరిశ్రేష్ఠమైన యీవులను దయచేయ
నీ కరుణచూపి నా కొసగినావు |2|
సమృద్ధి జీవము నా కొరకే తెచ్చితివి
సమీపించలేని నీ మహిమకై పిలిచిన
మహిమోన్నతుడా యేసయ్యా ||మనసార