సిలువ చెంత చేరిననాడు -
కలుషములను కడిగివేయు
పౌలు వలెను సీల వలెను -
సిద్ధపడిన భక్తుల జూచి
...సిలువ...
కొండవంటి బండవంటి -
మొండి హృదయంబు మండించు
పండియున్న పాపులనైన -
పిలుచుచుండె పరము చేర
...సిలువ...
వంద గొఱ్ఱెల మంద నుండి -
ఒకటి తప్పి ఒంటరియాయె
తొంబదితొమ్మిది గొఱ్ఱెలవిడచి -
ఒంటరియైన గొఱ్ఱెను వెదకెన్
...సిలువ...
తప్పిపొయిన కుమారుండు -
తండ్రిని విడచి తరలిపొయె
తప్పు తెలిసి తిరిగిరాగా -
తండ్రి యతని చేర్చుకొనెను
...సిలువ...
పాపి రావా పాపము విడచి -
పరిశుద్ధు విందులొ చేర
పాపుల గతిని పరికించితివా -
పాతాళంబే వారి యంతము
...సిలువ...
--Siluva chentha cherina naadu--