సిలువే నా శరణాయెను రా

Telugu Christian Song

సిలువే నా శరణాయెను రా నీ సిలువే నా శర ణాయెను రా సిలువ యందే ముక్తి బలముఁ జూచితి రా ||నీ సిలువే|| 1. సిలువను వ్రాలి యేసు పలికిన పలుకు లందు విలువలేని ప్రేమామృతముఁ గ్రోలితి రా ||నీ సిలువే|| 2. సిలువను జూచుకొలఁది శిలసమానమైన మనసు నలిగి కరిగి నీరగు చున్నది రా ||నీ సిలువే|| 3. సిలువను దరచి తరచితి విలువ కందఁగ రాని నీ కృప కలుష మెల్లనూ బాపఁగఁ జాలును రా ||నీ సిలువే|| 4. పలు విధ పథము లరసి ఫలిత మేమి గానలేక సిలువయెదుటను నిలచినాఁడను రా ||నీ సిలువే|| 5. శరణు యేసు శరణు శరణు శరణు శరణు నా ప్రభువా దురిత దూరుఁడ నీ దరిఁ జేరితి రా ||నీ సిలువే|| --Siluve naa saranam aayenu raa--
Telugu