సిలువలో సాగింది యాత్ర

Telugu Christian Song

సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర ||2|| ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే ||సిలువలో|| పాలు కారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో ||2|| నాట్యమాడినాయి నడి వీధిలో నిలిపాయి ||2|| నోరు తెరువ లేదాయే ప్రేమ బదులు పలుక లేదాయే ప్రేమ ||2|| ||ఇది ఎవరి|| వెనుక నుండి తన్నింది ఒకరు తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు ||2|| గేలి చేసినారు పరిహాసమాడినారు ||2|| నోరు తెరువ లేదాయే ప్రేమ బదులు పలుక లేదాయే ప్రేమ ||2|| ||ఇది ఎవరి|| --Siluvalo saagindi yaatra--
Telugu
1 views