సకలము చేయు సర్వాధికారి

Telugu Christian Song

సకలము చేయు సర్వాధికారి సర్వ జగతికి ఆధారుడా నా హృదిలో వసియింప వచ్చినవాడా (2) ఆరాధ్యుడా నా యేసయ్యా ఆరాధన నీకే (2) ||సకలము|| జగద్రక్షకుడా విశ్వవిదాత సర్వ కృపలకు దాతవు నీవే (2) బలియైతివా మా రక్షణకై సర్వ ఘనతలు నీకే ప్రభువా (2) సర్వ ఘనతలు నీకే ప్రభువా ||సకలము|| బల శౌర్యము గల యుద్ధ శూరుడవు సైన్యములకు అధిపతి నీవే (2) నా జయములన్ని నీవే ప్రభువా నా ఘనతలన్ని నీకే ప్రభువా (2) నా ఘనతలన్ని నీకే ప్రభువా ||సకలము|| కోటి సూర్య కాంతితో వెలుగొందుతున్న మహిమ గలిగిన రారాజువు నీవే (2) చీకటి ఎరుగని రాజ్యము నీది అంతమే లేదు నీ మహిమకు (2) అంతమే లేదు నీ మహిమకు ||సకలము|| --Sakalamu cheyu sar
Telugu