సఖుడా - దివ్య సఖుడా
ప్రియుడా - ప్రాణ ప్రియుడా
నీతో అనుబంధము కాదే ఈ నాటిది
ఏనాటికీ వీడిపోదు - విభుడా యేసయ్యా
ఇన్నినాళ్ల తీపి జ్ఞాపిక - పలికే గీతిక
1. మౌనరాగమే - మధురగానమై
మరుపురానిదై - మదిలో నిలిచెగా |2|
ఊహించని శోధనలే - శృతిలయలు నేర్పినాయి
పలుశ్రమలు నడిపినాయి నీ ప్రేమ శిఖరానికి
ఏకాంత వేళలో - ఏ కాంతి లేకున్ననూ
నా పాదములు జ్ఞారక - కాపాడే యేసయ్యా
సద్గుణ రాశివి నీవేనని
స్తుతి మహిమలు చెల్లించెదను
నిత్యము నిను కీర్తించెదను
|సఖుడా - దివ్య సఖుడా|
2. నిండు మనస్సులో - ప్రేమ దీపమై
మారుమనస్సుకై - సత్యమార్గమై |2|
పలికే ప్రేమనీవై - నీవు నాతో నున్నావు
నా హృదయసీమ నేలే - మ