సమర్పణ చేయుము ప్రభువునకు

Telugu Christian Song

సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును (2) అబ్రామును అడిగెను ప్రభువప్పుడు ఇస్సాకును అర్పణ ఇమ్మనెను (2) నీ బిడ్డను సేవకు నిచ్చెదవా (2) నీవిచ్చెదవా నీవిచ్చెదవా ||సమర్పణ|| ప్రభుని ప్రేమించిన పేదరాలు కాసులు రెండిచ్చెను కానుకగా (2) జీవనమంతయు దేవునికిచ్చెను (2) నీవిచ్చెదవా నీవిచ్చెదవా ||సమర్పణ|| నీ దేహము దేవుని ఆలయము నీ దేవుడు మలిచిన మందిరము (2) సజీవ యాగముగా నిచ్చెదవా (2) నీవిచ్చెదవా నీవిచ్చెదవా ||సమర్పణ|| --Samarpana cheyumu prabhuvunaku--
Telugu