సంబరాలు సంబరాలురో – మన బ్రతుకుల్లో సంబరాలు
చలి రాతిరి ఎదురు చూసే – తూరుపేమో చుక్క చూపే
గొల్లలేమో పరుగునొచ్చే – దూతలేమో పొగడ వచ్చే…! /2/
పుట్టాడు పుట్టాడురో! రారాజు – మెస్సయ్య పుట్టాడురో! మనకోసం! /2/
1. పశులపాకలో పరమాత్ముడు – సల్లని సూపులోడు సక్కనోడు
ఆకాశమంత మనసున్నోడు – నీవెట్టివాడవైన నెట్టివేయడు /2/
సంబరాలు సంబరాలురో – మన బ్రతుకుల్లో సంబరాలురో /2/
2. చింతలెన్ని ఉన్న చెంతచేరి చేరదీయు వాడు ప్రేమ గల వాడు
ఎవరు మరచిన నిన్ను మరువనన్న మన దేవుడు గొప్ప గొప్ప వాడు /2/
సంబరాలు సంబరాలురో – మన బ్రతుకుల్లో సంబరాలు /2/
--Sambaraalu sambaraaluro--