సంపూర్ణుడా నా యేసయ్యా

Telugu Christian Song

సంపూర్ణుడా నా యేసయ్యా సర్వ పరిపూర్ణత కలిగిన దేవా (2) నా యందు పరిపూర్ణత కోరితివే (2) నీ జీవ వాక్యమును నాకిచ్చితివే (2) ||సంపూర్ణుడా|| ఉపదేశించుటకు నను ఖండించుటకు నీ జీవ వాక్యమును నాకిచ్చితివే (2) నీతి యందు శిక్షణ చేయుటకు తప్పులను దిద్ది నను సరిచేయుటకు (2) నీ జీవ వాక్యమును నాకిచ్చితివే (2) ||సంపూర్ణుడా|| ప్రభుని యాత్రలో నే కొనసాగుటకు నీ జీవ వాక్యమును నాకిచ్చితివే (2) నీదు రాకడలో నీవలె ఉండాలని మహిమ శరీరము నే పొందాలని (2) నీ జీవ వాక్యమును నాకిచ్చితివే (2) ||సంపూర్ణుడా|| --Sampoornuda naa yesayya--
Telugu