సంతోషించుడి యందరు నాతో సంతోషించుడి
యొక వింతగు కీర్తన బాడ వచ్చితిని
సంతోషించుడి నాతో సంతోషించుడి ||సంతోషించుడి||
అంధకార మయమైన భూమి నా
ద్యంతము వెలిగింప – దాని యా-వేశము దొలఁగింప
వందితుండు క్రీస్తేసు నాథుడు – వచ్చె బ్రకాశుండై
భూమికి నిచ్చె ప్రకాశంబు ||సంతోషించుడి||
కాన నంధకారంబు దొలఁగఁ ప్ర
కాశించెను లెండు – మీరు ప్ర-కాశింపను రెండు
మానవులను సంతోష పర్చనై – మహిని నవతరించె
భక్తుల మనము సంతసించె ||సంతోషించుడి||
మిన్ను నుండి సంతోషోదయము
మిగుల ప్రకాశించె – హృదయములఁ – దగుల ప్రకాశించె
మున్ను జేయబడిన వాగ్ధత్థము – తిన్నగ నెరవేరే
భక్తుల కన్ను లాస దీరె ||సంతోషించుడి||
ప్రీతియైన నీ పండుగ గూర్చి
నూతన కీర్తనను