సంతోషం యేసు వందనం

Telugu Christian Song

సంతోషం యేసు వందనం నీవిచ్చిన ఈ సంతోష వస్త్రముకై సంతోష వస్త్రం మాకు ధరియింపజేశావు మా దుఃఖ దినములు సమాప్తపరచావు (2) సంతోషం యేసు వందనం నీవిచ్చిన ఈ సంతోష వస్త్రముకై స్తుతి స్తోత్రం ప్రతి నిత్యం మా దేవా నీకే అర్పితం ||సంతోష|| నిత్య సుఖములు కలవు నీ సన్నిధిలో దీవెన కలదు నీ ప్రతి మాటలో (2) విడువను ఎడబాయనని వాగ్ధానమిచ్చి బలపరచావు (2) ||సంతోషం|| రక్షణ ఆనందం మాకిచ్చావు మా క్రయ ధనమంతా చెల్లించావు (2) ఏ తెగులు నీ గుడారమును సమీపించదని సెలవిచ్చావు (2) ||సంతోషం|| --Santhosham yesu vandanam--
Telugu
1 views