సంతసంబున వత్తు సర్వేశ్వరుని

Telugu Christian Song

సంతసంబున వత్తు సర్వేశ్వరుని చిత్త మెంతయు నెరవేర్చను వంతలు విడి నాదు నంతరంగము కదుర నెంతో విశ్వాసమున వెంట వత్తును బ్రభువా ||సంత|| 1. సురుచిరమగు మరియ సూనుని యాజ్ఞలు శిరమున నిడికొందును మరియ మనసుతో మర్తమ్మ కరములతోఁ బరమ సౌఖ్యముఁ బొంద భక్తితో సేవింతు ||సంత|| 2. నారాజు సేవ దు ర్భరమై బాధగ నున్న భారంబుగను దోఁచదు సారెసారెకుఁ దనదు చక్కని చిఱునవ్వు వారించి భారమున్ ధీరత నొస గును ||సంత|| 3. కారుణ్యమున నాదు కల్మషమయ హృదయ భారములను మోసితి ఆ రాజ్యమునఁగల యాస్తికై నా చిత్త మాలసింపఁగ నెత్తి యందే స్థిరముగ నుంచు ||సంత|| 4. ఈ యుర్వి నేఁజేయు సేవకు ఫలములు నీ చోటఁ గనుఁగొందునే కాయం బీధర కర్మలం గరపిన నా యాస్తి నా హృదయ మ
Telugu