సన్నుతింతుమో ప్రభో

Telugu Christian Song

సన్నుతింతుమో ప్రభో సదమలమగు భక్తితో (2) కన్న తండ్రి కావుమా (2) కలుషము నెడబాపుమా ||సన్నుతింతుమో|| నీతి సూర్య తేజమా జ్యోతి రత్న రాజమా (2) పాతక జన రక్షకా (2) పతిత పావన నామకా ||సన్నుతింతుమో|| మానవ సంరక్షకా దీన నిచయ పోషకా (2) దేవా మానవ నందనా (2) దివ్య సుగుణ మందనా ||సన్నుతింతుమో|| ప్రేమ తత్వ బోధకా క్షేమ దాత వీవెగా (2) కామిత ఫలదాయక (2) స్వామి యేసు నాయక ||సన్నుతింతుమో|| పాప చింతలన్నిటిన్ పారదోలుమో ప్రభో (2) నీ పవిత్ర నామమున్ (2) నిరతము స్మరియించెదన్ ||సన్నుతింతుమో|| --Sannuthinthumo prabho--
Telugu
1 views