సోలిపోవలదు మనస్సా సోలిపోవలదు
నిను గని పిలచిన దేవుడు విడిచిపోతాడా ||2||
ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను
చుట్టుముట్టినా ||2||
ప్రియుడు నిన్ను చేరదీసిన
ఆనందం కాదా ||2||
శోధనలను జయించినచో
భాగ్యవంతుడవు ||2||
జీవ కిరీటం మోయువేళ
ఎంతో సంతోషము ||2||
వాక్కు ఇచ్చిన దేవుని నీవు
పాడి కొనియాడు ||2||
తీర్చి దిద్దే ఆత్మ నిన్ను
చేరే ప్రార్ధించు ||2||
--Solipovaladu manassa solipovaladu--