సర్వకృపానిదియగు ప్రభువా

Telugu Christian Song

సర్వకృపానిదియగు ప్రభువా సకల చరాచర సంతోషమా స్తోత్రము చేసి స్తుతించెదము సంతోషముగా నిను పొగడెదము ||సర్వ|| హల్లెలూయ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా యని పాడెదము ఆనందముతో సాగెదము 1.ప్రేమించి నన్ను వెదికితివి ప్రీతితో నన్ను రక్షించితివి పరిశుద్ధముగ జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి ||సర్వ|| 2.అల్పకాలశ్రమలనుభవింప - అనుదినము కృపనిచ్చితివి నాదుని అడుగు జాడలలో నడుచుటకు నను పిలిచితివి ||సర్వ|| 3.మరణ శరీరము మార్పు నొంది మహిమ శరీరము పొందుటకై మహిమాత్మతో నన్ను నింపితివి మరణ భయములను తీర్చితివి ||సర్వ|| --Sarva krupanidhi yagu prabhuva--
Telugu