సర్వచిత్తంబు నీదేనయ్యా
స్వరూపమిచ్చు కుమ్మరివే
సారెపై నున్న మాంటినయ్యా
సరియైన పాత్రన్ జేయుమయ్యా
సర్వేశ్వరా నేరిక్తుండను
సర్వదా నిన్నే సేవింతును ||సర్వ||
1. ప్రభూ! సిద్ధించు నీ చిత్తమే
ప్రార్థించుచుంటి నీ సన్నిధి
పరికింపు నన్నీదివసంబున
పరిశుభ్రమైన హిమముకున్న
పరిశుద్ధున్ జేసి పాలింపుమా
పాపంబుబోవ నను గడుగుమా ||సర్వ||
2. నీ చిత్తమే సిద్ధించు ప్రభూ
నిన్నే ప్రార్థింతు నా రక్షకా
నీచమౌ గాయముల చేతను
నిత్యంబు కృంగి అలసియుండ
నిజమైన సర్వశక్తుండవే నీ
చేతబట్టినన్ రక్షింపుమా ||సర్వ||
3. ఆత్మస్వరూప నీ చిత్తమే
అనిశంబు చెల్లు ఇహపరమున
అధికంబుగా నన్నీ యాత్మతో
ఆవరింపుమో నా రక్షకా
అందరూ నాలో క్రీస