సర్వలోక నివాసులారా – సర్వాధికారిని కీర్తించెదము

Telugu Christian Song

సర్వలోక నివాసులారా – సర్వాధికారిని కీర్తించెదము రారండి యెహోవా ఏతెంచెను- తన పరిశుద్ధ ఆలయములో మన సంతోషము – పరిపూర్ణము చేయు శాంతి సదనములో నివసింతుము 1. కరుణా కటాక్షము పాప విమోచన యేసయ్యలోనే ఉన్నవి విలువైన రక్షణ అలంకారముతో దేదీప్యమానమై ప్రకాశించెదము || సర్వలోక || 2. ఘనతా ప్రభావము విజ్ఞాన సంపదలు మన దేవుని సన్నిధిలో ఉన్నవి పరిశుద్ధమైన అలంకారముతో కృతజ్ఞత స్తుతులతో ప్రవేశించెదము || సర్వలోక || 3. సమృద్ధి జీవము సమైక్య సునాదము జ్యేష్ఠుల సంఘములో ఉన్నవి మృదువైన అక్షయ అలంకారముతో సద్భక్తితో సాగిపోదము || సర్వలోక || --Sarvaloka nivasulara sarvadhikaarini keerthinchedamu raarandi--
Hosanna ministries
Telugu