సర్వోన్నతుడా - నీవే నాకు ఆశ్రయదుర్గము -2
ఎవ్వరులేరు - నాకు ఇలలో -2
ఆదరణ నీవెగా -ఆనందం నీవెగా -2
1. నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట
నిలువలేరని యెహోషువాతో -2
వాగ్దానము చేసినావు..
వాగ్దానా భూమిలో చేర్చినావు -2
2. నిందలపాలై నిత్య నిబంధన
నీతో చేసిన దానియేలుకు -2
సింహాసనమిచ్చినావు..
సింహాల నోళ్లను మూసినావు -2
3. నీతి కిరీటం దర్శనముగా
దర్శించిన పరిశుద్ధ పౌలుకు -2
విశ్వాసము కాచినావు
జయజీవితము నిచ్చినావు -2
--Sarvonnathuda neeve naaku--