సరి చేయుమో దేవా

Telugu Christian Song

సరి చేయుమో దేవా నన్ను బలపరచుమో ప్రభువా (2) నీ ఆత్మతో నను అభిషేకించి సరి చేయుమో దేవా (2) ||సరి|| దూరమైతి నీ సన్నిధి విడచి పారిపోతి నీ గాయము రేపి లోకమునే స్నేహించితి నేను పాపము మదిలో నింపుకున్నాను (2) అది తప్పని తెలిసి తిరిగి వచ్చి నీ సన్నిధిలో నే మోకరించి (2) బ్రతిమాలుచున్నాను నన్ను సరి చేయుమో దేవా (2) ||సరి|| నింపుము నీ వాక్యమును మదిలో పెంచుము నను నీ పాలనలో శోధనను గెలిచే ప్రతి మార్గం ఇవ్వుము నాకు ప్రతి క్షణము (2) నీ సన్నిధిలో ఒక దినమైనను వేవేల దినములకంటే శ్రేష్టము (2) అని తెలుసుకున్నాను నన్ను సరి చేయుమో దేవా (2) ||సరి|| --Saricheyumo deva nannu--
Telugu
14 views