సరిచేయుమో దేవా

Telugu Christian Song

సరిచేయుమో దేవా నన్ను బలపరచుమో ప్రభువా (2) నీ ఆత్మతో నను అభిషేకించి సరి చేయుమో దేవా (2) ||సరి|| దూరమైతి నీ సన్నిధి విడచి పారిపోతి నీ గాయము రేపి లోకమునే స్నేహించితి నేను పాపము మదిలో నింపుకున్న అది తప్పని తెలిసి తిరిగి వచ్చి నీ సన్నిధిలో నే మోకరించి బ్రతిమాలుచున్నాను నన్ను సరి చేయుమో దేవా (2) ||సరి|| నింపుము నీ వాక్యము మదిలో పెంచుము నను నీ పాలనలో శోధనను గెలిచే ప్రతి మార్గం ఇవ్వుము నాకు ప్రతి క్షణము నీ సన్నిధిలో ఒక దినమైనను వేయి దినములకంటే బహుశ్రేష్టము.. అని తెలుసుకున్నాను నన్ను సరి చేయుమో దేవా (2) ||సరి|| --Saricheyumo deva nannu balaparachumo prabhuva--
Telugu