సృష్టి కర్తవైన యెహోవా
నీ చేతి పనియైన నాపై ఎందుకింత ప్రేమ
మంటికి రూపమిచ్చినావు -
మహిమలో స్థానమిచ్చినావు
నాలో నిన్ను చూశావు -
నీలో నన్ను దాచావు
నిస్వార్ధమైన నీ ప్రేమ -
మరణము కంటె బలమైనది నీ ప్రేమ
1. ఏ కాంతి లేని నిశీధిలో -
ఏ తోడు లేని విషాదపు వీధులలో
ఎన్నో అపాయపు అంచులలో -
నన్నాదుకున్న నా కన్నతండ్రివి
యేసయ్యా నను అనాధగ విడువక
నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి ॥ సృష్టి ॥
2. నిస్సారమైన నా జీవితములో -
నిట్టూర్పులే నను దినమెల్ల వేదించగా
నశించిపోతున్న నన్ను వెదికి వచ్చి -
నన్నాకర్షించిన ప్రేమ మూర్తివి
యేసయ్యా నను కృపతో బలపరచి
ఉల్లాస వస్త్రములను నాకు ధరింపజేసితివి ॥ సృష్టి ॥
--Srusti kar