సృష్టి పితా - సర్వోన్నతా

Telugu Christian Song

సృష్టి పితా - సర్వోన్నతా సమర్పింతున్ - సర్వస్వమున్ 1. భూమి ఆకాశము నీవే భూధర శిఖరములు నీవే భూ ప్రజలు నీవారే బల శౌర్యములు నీవే 2. మా వెండి బంగారములు నీవే మాకున్న వరములు నీవే మా దేహముల్ మా గేహముల్ మా జీవితము నీవే 3. వెల లేని గాలి వెలుతురులు విలువైన పాడి పైరులు వివిధంబులైన దీవెనల నీ కరుణా వర్షములు 4. పరిశుద్ద గ్రంథపు పలుకులు పరలోక తేనె చినుకులు ప్రభు యేసుని మాటలు మా వెల్గు బాటలు --Srusti pithaa sarvonnathudaa--
Telugu
14 views