సృష్టికర్త యేసుని

Telugu Christian Song

సృష్టికర్త యేసుని స్తుతించెదము సర్వసృష్టియు ప్రభు క్రియలే సర్వ జనాలి సునాదముతో ప్రభుని క్రియలు ఘనపరచెదము హ... హ.. హ... హ.. హల్లెలూయా... (3X) 1. అగాధజలములపై ఆత్మ అలల ఊయల ఊగిన వేల చీకటిని విడదీసి శూన్యమును వెలిగించి నీదు మహిమను చూపితివే |సృష్టి.. 2. అంతరిక్షమున జ్యోతులను అభినవ లోకము విరసిన వేళ ప్రాణులను సృజియించి ప్రకృతిని యింపుగను రూపించిన నిను పొగడెదను |సృష్టి.. 3. భూఆవిరిని రప్పించి ఆరిన నేలను తడిపిన వేళ మంటి నుండి మము చేసి నాసికలో జీవమూది మనిషికి రూపము నిచ్చితివే |సృష్టి.. --Srustikartha yesuni sthuthinchedam--
Telugu
10 views