సుమధుర స్వరముల గానాలతో –
వేలాది దూతల గళములతో
కొనియాడబడుచున్న నా యేసయ్యా –
నీకే నా ఆరాధన (2)
మహదానందమే నాలో పరవశమే
నిన్ను స్తుతించిన ప్రతీక్షణం (2) ||సుమధుర||
ఎడారి త్రోవలో నే నడిచినా –
ఎరుగని మార్గములో నను నడిపినా
నా ముందు నడచిన జయవీరుడా –
నా విజయ సంకేతమా (2)
నీవే నీవే – నా ఆనందము
నీవే నీవే – నా ఆధారము (2) ||సుమధుర||
సంపూర్ణమైన నీ చిత్తమే –
అనుకూలమైన సంకల్పమే
జరిగించుచున్నావు నను విడువక –
నా ధైర్యము నీవేగా (2)
నీవే నీవే – నా జయగీతము
నీవే నీవే – నా స్తుతిగీతము (2) ||సుమధుర||
వేలాది నదులన్ని నీ మహిమను –
తరంగపు పొంగులు నీ బలమును
పర్వత శ్రేణులు నీ కీర్తినే –
ప్రకటించుచున్నవేగా (2)
నీవే