శ్రీ యేసుండు జన్మించె రేయిలో నేఁడు పాయక బెత్లెహేమ యూరిలో |శ్రీ యేసుండు|
1. కన్నియ మరియమ్మ గర్భమందున ని మ్మాను యేలనెడి నామమందున |శ్రీ యేసుండు|
2. సత్ర మందునఁ బశువుల సాలయందున దేవ పుత్రుండు మనుజుండాయెనందున |శ్రీ యేసుండు|
3. పట్టి పొత్తిగుడ్డలతోఁ జుట్టఁబడి పసుల తొట్టిలోఁ బరుండబెట్టఁబడి |శ్రీ యేసుండు|
4. గొల్లలెల్లరు మిగుల భీతిల్లఁగ దెల్పె గొప్ప వార్త దూత చల్లఁగ |శ్రీయేసుండు|
5. మన కొఱకొక్క శిశువు పుట్టెను ధరను మన దోషములఁ బోఁగొట్టను |శ్రీ యేసుండు|
6. పరలోకపు సైన్యంబుఁ గూడెను మింట వర రక్షకుని గూర్చి పాడెను |శ్రీ యేసుండు|
7. అక్షయుండగు యేసు వచ్చెను మనకు రక్షణంబు సిద్ధపర్చెను |శ్రీయే