శ్రీ యేసునే భజించు నా మనసా

Telugu Christian Song

శ్రీ యేసునే భజించు నా మనసా శ్రీ యేసునే భజించు శ్రీ యేసు ప్రభునే భజించు నా మనసా శ్రీ యేసునే భజించు ||శ్రీ యేసు|| 1. యేసు త్రిత్వమం దీశ కుమారుఁడు భాసురుఁ డాతఁడు భూషిత రక్షకుఁడు ||శ్రీ యేసు|| 2. నరుల దురితస్థితిఁ గరుణించి వారికిఁ పరమ సుఖము లిడ పరికించి వచ్చిన ||శ్రీ యేసు|| 3. స్వామికి మహిమయు భూమికి నెమ్మది క్షేమము నియ్యను లేమిడిఁ బుట్టిన ||శ్రీ యేసు|| 4. నరులను తండ్రితో నైక్యము జేయగ నిరతము వేఁడెడి నిజప్రాపకుఁ డగు ||శ్రీ యేసు|| 5. మూఁడవ దినమున మృత్యువు నోడించి తడయక పునరు త్థానము నొందిన ||శ్రీ యేసు|| --Sree yesune bhajinchu naa manasa--
Telugu