శ్రీమంతుడా శ్రీకరుండ శ్రీ

Telugu Christian Song

శ్రీమంతుడా శ్రీకరుండ శ్రీ యేసు రాజా అతి శ్రేష్ఠుడా అద్వితీయుడా అతికాంక్షనీయుడా ధవళవర్ణుడా మహోన్నతుడా పరిశుద్దుడా మృత్యుoజేయుడా జయము జయము నా యేసునికే జయము జయము నా రారాజుకే ఆదిలో ఉన్నవాడా ఆది సంభూతుడ విశ్వమంతా వ్యాపించిన సృష్టి కర్తా సింహాసనాసీనుడా శక్తి సంపన్నుడా మహిమ నీకే ఘనత నీకే స్తుతులు నీకే నా యేసయ్య కృపాసమృద్ధిగలవాడ ప్రేమామయుడా బలవంతుడైన పరాక్రముడా శక్తిమంతుడా దీర్ఘశాంతముగలవాడా సమాధానమిచ్చువాడా జయ గీతము నీకై పాడెదము నాట్యము చేసి ఆనందించేదం లోకాధిపతి సర్వోన్నతుడా కారణ జన్ముడా లోకానికి వెలుగైనవాడా తేజోమయుడా దయాదాక్షిణ్యపూర్ణుడా మహిమాన్వితుడా ఘనతకు పాత్రుడ నీవయ్యా గళమెత్తి నిన్ను పొగడెదమయ
Telugu