శ్రీమంతుడా యేసయ్యా
నా ఆత్మకు అభిషేకమా
నా అభినయ సంగీతమా (2)
1. సిలువధారి నా బలిపీఠమా
నీ రక్తపు కోట నాకు నివాసమా (2)
నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా
ఇదియే నీ త్యాగ సంకేతమా (2) ||శ్రీమంతుడా||
2. మహిమగల పరిచర్య పొందినందున
అధైర్యపడను కృప పొందినందున (2)
మహిమతో నీవు దిగి వచ్చువేళ
మార్పునొందెద నీ పోలికగా (2) ||శ్రీమంతుడా||
3. సీయోను శిఖరము సింహాసనము
వరపుత్రులకే వారసత్వము (2)
వాగ్దానములన్ని నేరవేర్చుచుంటివా
వాగ్దానపూర్ణుడా నా యేసయ్యా (2) ||శ్రీమంతుడా||
--Sreemanthuda yesayya naa aathmaku--