షాలోము రాజుకు వందనం

Telugu Christian Song

షాలోము రాజుకు వందనం సీయోను పాటలు పాడెదం (2) యేసు రాజ వందనం మహిమ రాజ వందనం మృత్యుంజయుడా వందనం ముక్తి దాత వందనం ||షాలోము|| ఖాళీ అయిన సమాధి చూసి చావు పరుగులు తీసెను అలసి పాపమొందిన ఓటమి తెలిసి పారిపోయెను అపవాది జడిసి (2) ||యేసు రాజ|| మొదటి ఆదాము చేసిన పాపం మానవులపై తెచ్చెను మరణం కనికరముతో కడపటి ఆదాము గెలిచి మరణము తెచ్చెను జీవం (2) ||యేసు రాజ|| --Shalomu raajuku vandanam--
Telugu