శాశ్వతమైనదీ నీతో నాకున్న

Telugu Christian Song

శాశ్వతమైనదీ నీతో నాకున్న అనుబంధము మరువలేనదీ నాపై నీకున్న అనురాగము ||2|| యేసయ్యా నీ నామ స్మరణయే నీ శ్వాస నిశ్వాసవాయెను ||2|| ||శాశ్వత|| 1.సంధ్యారాగము వినిపించినావు నా హృదయ వీణను సవరించినావు ||2|| నా చీకటి బ్రతుకును వెలిగించినావు ||2|| నా నోట మృదువైన మాటలు పలికించినావు ||శాశ్వత|| 2.నా విలాప రాగాలు నీవు విన్నావు వేకువ చుక్కవై దర్శించినావు అపవాది ఉరుల నుండి విడిపించినావు ||2|| శత్రువులను మిత్రులుగా నీవు మార్చియున్నావు||శాశ్వత|| --Saswathamainadi neetho naakunna anubandhamu--
Telugu